త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీ అదేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా తరువాత వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే ఎన్టీఆర్ అయన వెర్షన్ ను చాలా వరకు కంప్లీట్ చేశారట. ఇటు రాజమౌళి సినిమా చేస్తూనే మరోవైపు అరవింద సమేత వంటి బెస్ట్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆ సినిమా టైటిల్ ‘అయినను పోయిరావలె హస్తినకు’ అని కూడా ప్రకటించారు. లాక్ డౌన్ లేకుంటే ఈ సినిమా మే లేదా జూన్ లో ప్రారంభం అయ్యి ఉండేది.

కానీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా సెప్టెంబర్ కు పోస్ట్ ఫోన్ అయ్యిందట. సెప్టెంబర్ నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇక త్రివిక్రమ్ టీమ్ వచ్చే సమ్మర్ వరకు షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే మే లేదా జూన్ లో సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉందట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ ను ఒక హీరోయిన్ గా తీసుకున్నారని ప్రచారం జరుగుతున్నది. మరో హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకున్నట్టుగా ప్రచారం. ఈ ఇద్దరు బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు.

జాన్వీ కపూర్ కు బాలీవుడ్లో మంచి మార్కెట్ ఉన్నది. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చేస్తున్న సినిమా కాబట్టి బాలీవుడ్ లో ఈ స్టార్ హీరోకు మార్కెట్ వస్తుంది. అయితే ఈ సినిమాను ఎన్టీఆర్ త్రివిక్రమ్ లు పాన్ ఇండియా మూవీగా రూపొందించే ఆలోచనలో పడ్డారట. ఇటీవలే బన్నీతో సుకుమార్ రూపొందించే సినిమా పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసి టాలీవుడ్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినిమా డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ తో చేయబోయే సినిమానే త్రివిక్రమ్ కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అవుతుంది. చూడాలి మరి త్వరలో ఏదైనా కబురు అందుతుందేమో..

Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *