ఏ,పి లో వ్యాక్సినేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి తీసుకున్న సంచలన నిర్ణయం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఇప్పటివరకు వ్యాక్సిన్ కొరత ఇతర సమస్యల వల్ల కేంద్రం చెప్పినప్పటికీ 18 ఏళ్ల పై బడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వలేదు. దీనిపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు ఫై బడిన అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని ప్రకటించింది. దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. సోమవారం నుండి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయండి. ప్రతి ఒక్కరూ తమ గ్రామ సచివాలయాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టీకాలు వేయించుకోవచ్చు అని ఆరోగ్య అధికారి చెప్పారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో 578 ప్రదేశాలలో  18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేసింది.  దీనితో ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అపోహలను నమ్మవద్దని రాష్ట్రంలోని ప్రజలందరికీ ఎపి ఆరోగ్య శాఖ అధికారులు పిలుపునిచ్చారు. టీకా తీసుకుంటే అనారోగ్యం పాలు అవుతున్నారు అనే వ్యాఖ్యలని నమ్మి కొందరు టీకా తీసుకోవడానికి జంకుతున్నారు. దీనితో అధికారులు ప్రజలని ఏ మాత్రం భయం అక్కర్లేదు. నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్తున్నారు.
ఇదిలా ఉంటే .. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రికార్డు స్ధాయిలో వ్యాక్సినేషన్  డ్రైవ్ నిర్వహించారు. కేవలం నిన్న ఒక్క రోజే వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో 13 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం ద్వారా  కొత్త రికార్డు సృష్టించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో వాలంటీర్ల వద్ద నుంచి వైద్య సిబ్బంది వరకూ అందరూ చాలా కష్టపడ్డారని వారందరినీ సీఎం వైఎస్ జగన్ వారందరినీ అభినందించారాని ఆయన తెలిపారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. ఉదయం నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రజలకు చేరువ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 2232 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక డ్రైవ్ గా నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో లక్షన్నర మందికి పశ్చిమగోదావరి జిల్లాలో1.45 లక్షల మందికి కృష్ణాలో 1.30 లక్షలు విశాఖలో 1.10 లక్షలు.. గుంటూరులో 1.01 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు.Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *