టైమ్ ఫిక్స్ చేసిన బాలయ్య

టాలీవుడ్ లో ప్రకటనల పండగ నడుస్తుంది. సినిమాల విడుదల తేదీలని ప్రకటిస్తూ అభిమానులని అలరిస్తున్నారు హీరోలు. ఇందులో నందమూరి అభిమానులకే చిన్న నిరాశ. కారణం నటసింహ బాలయ్య నుంచి ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడా లోటు తీర్చేశారు బాలయ్య. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇపుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేశారు. ఈ ఏడాది మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది యూనిట్. బాలయ్య- బోయపాటిలది సూపర్ హిట్ కాంబినేషన్.


ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ హిట్‌ కాంబినేషన్‌లో మూడో చిత్రం సహజంగానే అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్. త్వరలోనే సినిమా టైటిల్ తో పాటు ట్రైలర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ సరే… టైటిల్ ఏది? నంద‌మూరి అభిమానుల‌కు గుడ్ న్యూస్ అందింది. బాల‌కృష్ణ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రాన్ని మే 28న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు రెడీ అయిపోయారు. రిలీజ్ డేట్ ఓకే. కానీ… ఈ సినిమా టైటిల్ ఏమిట‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కూ తెలీలేదు.


సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌కుండా… రిలీజ్ డేట్ చెప్పేశారేంటో? బ‌హుశా.. ఇదో కొత్త ట్రెండ్ అనుకోవాలి. ఈ సినిమా కోసం `మోనార్క్‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో వుంది. దాదాపు అదే ఖాయం అనుకుంటున్నారంతా. ఆ టైటిలే అయితే… ఈపాటికే టైటిల్ చెప్పేసేవారు. కానీ.. టైటిల్ విష‌యంలో బోయపాటి.. పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఈమ‌ధ్య‌… బోయాపాటి కాస్త పొయెటిక్ టైటిల్ ల‌పై దృష్టి పెట్టాడు. విన‌య విధేయ రామా, జ‌య జాన‌కీ నాయ‌క‌.. ఇలా అన్న‌మాట‌. ఈసారీ అదే ఫాలో అవుతాడా? లేదంటే సింహా, లెజెండ్ లా… షార్ప్ గా ఉండే టైటిల్ తో వ‌స్తాడా? అనేది ఆస‌క్తి క‌లిగిస్తోంది. ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలోనే బోయ‌పాటి టైటిల్ నీ ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *