ఆంధ్రప్రదేశ్ లో ప్రజాఆరోగ్యం పై బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఫైర్ !!!
వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం కరోన కోరల్లో చిక్కుకుంది.. : తెదేపా నాయకులు 

బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మ గారి ఆదేశాల మేరకు బుధవారం బాపట్ల పట్టణం,కర్లపాలెం మండలం, పిట్టలవానిపాలెం మండలంలో ని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎం. ఆర్. ఓ లకు తెలుగుదేశం పార్టీ బాపట్ల పట్టణ మరియు బాపట్ల మండలం,కర్లపాలెం మండలం,పిట్టలవానిపాలెంమండల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ మరియు మండలాల అధ్యక్షులు మాట్లాడుతూ… ఆక్సిజన్ లేక మరణించిన కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లించాలన్నారు.


  కోవిడ్ కారణంగా పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కరువైంది కాబట్టి ప్రతి తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబానికి రూ 10 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.  కరోనా మృతుల దహన సంస్కారాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు.  విధి నిర్వహణలో చనిపోయిన ఫ్రంట్లైన్ వారియర్స్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని కోరారు.  అన్న క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించి కోవిడ్ బాధితులతో పాటు పేదల ఆకలి తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ, బాపట్ల మండల అధ్యక్షులు,కర్లపాలెం మండల అధ్యక్షులు,పిట్టలవానిపాలెం మండల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *