వికెట్లను తన్నిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌ షకీబల్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధం

ఢాకా టీ20 ప్రీమియర్ లీగ్‌లో వికెట్లను తన్ని అనుచితంగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మూడు…

నన్ను కెప్టెన్ గా నియమిస్తారనుకుంటే ధోనీకి అవకాశం ఇచ్చారు: యువరాజ్ సింగ్

వన్డేల్లో 8 వేలకు పైగా పరుగులు, 17 అంతర్జాతీయ సెంచరీలు (వన్డేలు, టెస్టుల్లో కలిపి) సాధించి, 100కు పైగా వన్డే వికెట్లను…

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ కు స్కాట్ స్టైరిస్ బంపర్ ఆఫర్

మంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ పేరు ఇప్పడు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. వివిధ దేశాల క్రికెటర్లు సూర్యకుమార్ను ప్రశంసిస్తున్నారు.…

ముంబై -ఢిల్లీ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందా.?

ఐపీఎల్ జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా మ్యాచ్ లు ఉత్కంఠ రేపుతున్నాయి. మ్యాచ్ లు టై అవుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.…

తొలిసారి సచిన్ ఏడవడం చూశా: గంగూలీ

1997లో వెస్టిండీస్‌ పర్యటనలో కెప్టెన్‌గా ఉన్న సచిన్‌ టెస్టు మ్యాచ్‌లో ఓటమి జీర్ణించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న మాస్టర్ ఈ కోపాన్ని తనపై…

బెస్ట్ కెప్టెన్ కోహ్లీ కాదు… ధోనీ, రోహిత్ లేనట… 20 మంది ఐపీఎల్ నిపుణుల జ్యూరీ!

  • ఐపీఎల్ అత్యుత్తమ క్రీడాకారుల ఎంపిక
  • ఉత్తమ కెప్టెన్ లుగా ధోనీ, రోహిత్
  • భారత బెస్ట్ బ్యాట్స్ మన్ గా విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు అత్యుత్తమ కెప్టెన్ లు ఎవరన్న ప్రశ్న ఎదురైతే, చాలా మంది పేర్లే సమాధానంగా వస్తాయి. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి పేర్లు వినిపిస్తాయి. ఇక, ఐపీఎల్ లో అత్యుత్తమ కెప్టెన్లు ఎవరన్న ప్రశ్న ఎదురైతే… దాదాపు 20 మంది మాజీ క్రికెటర్లు, క్రీడా జర్నలిస్టులు, నిపుణులతో కూడిన స్టార్ స్పోర్ట్స్ ప్రత్యేక జ్యూరీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఐపీఎల్ లో ఎంఎస్‌ ధోని, రోహిత్‌ శర్మలు బెస్ట్ కెప్టెన్లని జూరీ సభ్యులు తేల్చారు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ నాలుగు సార్లు, ధోని సారథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడు సార్లు టైటిల్‌ గెలిచిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

ఇక ఇదే సమయంలో మిగతా అవార్డులను పొందిన వారి వివరాలను కూడా జ్యూరీ ప్రకటించింది. ఐపీఎల్‌ బెస్ట్‌ బ్యాట్స్‌ మన్‌ గా ఏబీ డివిలియర్స్, భారత అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ, ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ బౌలింగ్‌ విభాగంలో నిలిచారని వెల్లడించింది. బెస్ట్ ఆల్ రౌండర్ గా షేన్ వాట్సన్, సీఎస్‌కే ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఉత్తమ కోచ్‌ గా ఎంపికయ్యారు.

Share With: