కరోనా థర్డ్ వేవ్ మృత్యుఘోష .. 5 లక్షలు దాటిన మృతుల సంఖ్య !
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు లక్షల్లో పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో  కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినప్పటికీ ఇంకా కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కరోనా విజృంభణతో వణికిపోతోన్న బ్రెజిల్ లో థర్డ్ వేవ్ విజృంభణ మొదలైనట్లు అక్కడి పరిస్థితులని బట్టి నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్కడ ప్రతిరోజూ కూడా వేల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బ్రెజిల్ లో కరోనా మరణాల సంఖ్య 5లక్షలు దాటింది. మరణాల సంఖ్యలో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది.


అయితే బ్రెజిల్ ప్రజలు కరోనా నిబంధనలు పాటించకుండా వ్యవహరించడం అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మందకొడిగా సాగుతుండడంతో బ్రెజిల్ కి మరోముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కొంచెం తగ్గుముఖం పడుతున్నప్పటికీ దక్షిణ అమెరికా దేశాలల్లో మాత్రం విజృంభిస్తోంది. ముఖ్యంగా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న బ్రెజిల్ లో కరోనా వ్యాప్తి అదుపులోకి రావడంలేదని పలువురు వైద్య నిపుణులు తెలిపారు. తాజాగా బ్రెజిల్ లో మూడో దశ విజృంభణ మొదలైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 24 గంటల్లో దేశంలో 2300 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5లక్షలు దాటింది. అయితే  మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని బ్రెజిల్ లో ప్రస్తుతం కఠిన కోవిడ్ ఆంక్షలులేకపోవడంతో  కరోనా ఉధృతి పెరుగుతోందని అంచనా వేస్తున్నారు.Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *