ఏ.పి లో మరో గ్యాంగ్ రేప్.. రేపల్లె రైల్వే స్టేషన్ లో

రైల్వేస్టేషన్ లో భర్తను కొట్టి గ్యాంగ్ రేప్ ??

ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్న అత్యాచార ఉదంతాలతో ఏపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఇటీవల అత్యాచారాలు.. సామూహిక అత్యాచార ఉదంతాలు వరుస పెట్టి బయటకు వస్తున్నాయి. ఇలాంటి నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న డిమాండ్ పెరుగుతోంది. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ యాప్ ఉన్నప్పుడు.. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని కొందరు ప్రశ్నిస్తున్నారు.
<


div class=”descpt telugu”>

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఒక రైల్వే స్టేషన్ లో భర్తను కొట్టి.. భార్యపై సాముహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఉదంతానికి బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్ వేదిక కావటం షాకింగ్ గా మారింది. సాధారణంగా రైల్వే స్టేషన్ అన్నంతనే ప్రయాణికుల రద్దీ ఉంటుంది. అలాంటి చోటు సామూహిక అత్యాచారం ఎలా జరుగుతుందన్న ప్రశ్న కొందరికి తలెత్త వచ్చు. అయితే.. మిగిలిన రైల్వే స్టేషన్లకు కాస్త భిన్నం రేపల్లె రైల్వే స్టేషన్.

ఈ స్టేషన్ కు పరిమిత సంఖ్యలో మాత్రమే రైళ్లు వస్తుంటాయి. దీనికి తోడు.. ఈ రైల్వే లైన్ రెపల్లే స్టేషన్ తో ఎండ్ అవుతుంది. అందుకే.. కొన్ని రైళ్లు మాత్రమే రావటం.. రైలు వచ్చే సమయంలో ప్రయాణికులతో స్టేషన్ కళకళలాడుతుంది. మిగిలిన సమయాల్లో ఏ మాత్రం రద్దీ ఉండదని చెబుతున్నారు. అయితే..
తాజా ఉదంతం ఏ విధంగా జరిగిందన్న సమాచారం ఇంకా బయటకు రాలేదు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. రేపల్లె రైల్వే స్టేషన్ లో వలసకూలీ అయిన భార్యభర్తలు రావటం.. మహిళ మీద కన్నేసిన ముగ్గురు.. భర్తను కొట్టి.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు.

ఈ ఉదంతం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏమైనా రైల్వేస్టేషన్ లో భర్తను కొట్టి భార్యను గ్యాంగ్ రేప్ చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఉదంతం గురించి విన్నంతనే.. ఏపీ ఏమైంది నీకు? అన్న ప్రశ్న తలెత్తక మానదు.
Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *