ఎన్ఆర్ఐ భర్తకు చుక్కలు చూపిస్తున్న భార్య.. షాకిచ్చిన హైకోర్టు

వాళ్లిద్దరూ అమెరికాలో జీవించే మన దేశానికి చెందిన భార్యభర్తలు.. అయితే బిడ్డకు అనారోగ్యం అని భార్య ఇండియాకు వచ్చింది. ఏళ్లు గడుస్తున్నా భార్య బిడ్డ తిరిగి అమెరికాకు రావడం లేదు. దీంతో సదురు ఎన్నారై భర్త కోర్టుకు ఎక్కాడు. తనకు న్యాయం కావాలని కోరాడు. అమెరికాలోని స్థానిక కోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే భారత్ లో ఉన్న అతడి భార్య మాత్రం అమెరికాకు వెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఈ కేసు పంజాబ్-హర్యానా కోర్టుకు చేరింది.


దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కూడా భర్తకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. బిడ్డను తీసుకొని వెంటనే ఎన్నారై మహిళ అమెరికా వెళ్లాలని సూచించింది.  ఈ కేసుపై తదుపరి విచారణ తీర్పు అమెరికా కోర్టు ఇస్తుందని వెల్లడించింది. పంజాబ్ కోర్టులో ఓ ఎన్నారై తన బిడ్డ కోసం అప్పీల్ చేశాడు. అమెరికాలోని అర్కన్సాస్ బెంటన్ కౌంటీకి చెందిన సదురు ఎన్నారై బిడ్డకు వైద్యం చేయించాలని ఆక్ష్న భార్య 2019లో భారత్ కు వచ్చిందని.. కానీ ఇప్పటివరకు తిరిగి రాలేదని అప్పీల్లో పేర్కొన్నాడు. వెంటనే సదురు మహిళను అమెరికా వెళ్లాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే తన బిడ్డకు భారత్ లో ఇంకా చికిత్స అందించాల్సి ఉందని.. ఇక్కడే మెరుగైన చికిత్స అందించగలుగుతామని.. భార్య చెప్పింది. కోర్టు మాత్రం వినిపించుకోలేదు. వెంటనే అమెరికా వెళ్లాలని కోర్టు తీర్పునిచ్చింది.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *