టమాటల్లో మనుషుల మాదిరిగా నాడీ వ్యవస్థ!

నేటి టెక్ యుగంలో ఏం తింటే…. ఎలాంటి సమస్యలు వస్తాయో? అని చాలా మంది కంగారు పడుతుంటారు. ఇలా ఏవి పడితే అవి తినకుండా తమ కడుపుని నోరుని అదుపులో పెట్టుకుంటారు. చాలా మంది రకరకాల వస్తువులు ఆహార పదార్థాలు తినాలని అనిపించినా కూడా భయంతో వాటిని తినరు. అటువంటి వాటిలో టమాట ఒకటి. కిడ్నిల్లో సమస్యలు ఉన్న వారు టమాటాలు తినకూడదని సాధారణంగా కూడా టమాటాలు అతిగా తినకూడదని పలువురు చెబుతారు. ఇలా టమాటాలను అందులో ఉండే గింజలను అధిక మోతాదులో తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతారు. కానీ టమాటాలు తినడం మూలాన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి కీటకాలు చేసే దాడిని ముందుగానే పసిగట్టి పక్కన ఉన్న మొక్కలకు సంకేతాలు పంపుతాయి. టమాటా లో నాడీ వ్యవస్థ ఉందని కూడా చాలా


మంది తెలిసిన వారు చెబుతూ ఉంటారు. ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా టమాటా మొక్కలు పక్కనున్న సహచర మొక్కలకు సంకేతాలు పంపి వాటిని జాగ్రత్తగా ఉండేలా చేస్తాయి. వీటిల్లో ఉన్న నాడీ వ్యవస్థ కూడా అచ్చం మనలో ఉన్న నాడీ వ్యవస్థలాగానే పని చేస్తుందట. టమాటాలు ఇతర జాతి మొక్కల సంరక్షణకు ముందుగానే కీటకాల భారి నుంచి రక్షించుకునేలా సందేశాలు పంపుతాయి. ఈ విషయాన్ని ఎవరో అనామకులు చెప్పలేదు. స్వయానా కొంత మంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి మరీ ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. మానవ నాడీ వ్యవస్థలో విద్యుత్ సంకేతాలను పంపడానికి న్యూరాన్లను వివిధ భాగాలు కలిగి ఉంటాయి. కానీ అలా మొక్కల్లో న్యూరాన్లు ఉండవు. కానీ ఆకులు పండ్ల మధ్య జిలేమ్ ఫ్లోయమ్ అనే నిర్మాణాలు ఉంటాయట. ఇవి పైపుల మాదిరి నిర్మాణం కలిగి ఉంటాయి. ఈ పైపుల మాదిరి ఉన్న జిలేమ్ ఫ్లోయమ్ ద్వారా చార్జ్ డ్ అయాన్లు మొక్కల్లోని అనేక భాగాల చుట్టూ న్యూరాన్ల వలే చేరుకుని విద్యుత్ సంకేతాలను ప్రసారం చేస్తాయట.


ఇలా మంచిగా ఉన్న ఆకులకు మాత్రమే కాకుండా దెబ్బతిన్న ఆకులకు కూడా ఇవి విద్యుత్ సంకేతాలు పంపుతాయని పరిశోధనలో వెల్లడైంది. ఇలా కేవలం మొక్కల్లోనే జరుగుతుందా? లేక టమాట కాయలు పండ్లలో కూడా జరుగుతుందా? అని బ్రెజిల్లోని ఫెడరల్ యూనివర్శిటీ కి చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేయగా… షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మొక్కల్లోనే కాకుండా టమాట పండ్లలో కూడా ఎలక్ర్టాన్లు విద్యుత్ సంకేతాలను పంపడం గమనించి ఆశ్చర్యపోయారు. ఇందుకోసం వారు ప్రత్యేకంగా పండ్ల మీద కొన్ని రకాల కీటకాలను ఉంచి టెస్టులు చేశారు. ఇలా ఉంచిన కీటకాలు పండ్లను తినడం మొదలు పెట్టిన తర్వాత విద్యుత్ సంకేతాల సరళి మారినట్లు గమనించారు. అంతే కాకుండా విద్యుత్ తరంగాల కార్యకలాపాలు ప్రతి నిముషం మారుతూ ఉంటాయని వారు గుర్తించారు. అంతేకాకుండా ఏదైనా కీటకాలు దాడి చేసినపుడు కూడా తరంగాల ప్రభావం ఎలా ఉంటుందో వారు గుర్తించారు. టమాటాలు కేవలం శరీరానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా వాటికవి రక్షించుకుంటూ పక్క జాతి మొక్కలను ఎలా రక్షిస్తాయో…..


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *