రైలు లేటయిందా? ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిందే: సుప్రీం సంచలన తీర్పు

రైలు ప్రయాణం అంటే చుక్కలు చూడాల్సిందే.. ఏ రైలు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎంత లేటో అస్సలు చెప్పలేం. దేశవ్యాప్తంగా ఇష్టారాజ్యంగా నడుస్తున్న రైళ్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఓ రైలు ఆలస్యంగా ప్రయాణించడం ద్వారా ప్రయాణికుడికి నష్టం కలిగితే మాత్రం రైల్వే శాఖ పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందులో సాకులు వెతుక్కోవడానికి ఏమీ లేదని తెలిపింది. చాలా సార్లు రైళ్లు ఆలస్యం కావడం వల్ల ముఖ్యమైన పనులు చేయలేక ప్రజలు సతమతమవుతుంటారు. సరేలే అని సర్ధుకుపోతుంటారు సామాన్యులు.


కానీ ఓ వ్యక్తి అలా ఊరుకోకుండా రైలు ఆలస్యంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఫలితం సాధించాడు. 2016లో కశ్మీర్ కు చెందిన సంజయ్ శుక్లా జమ్మూ నుంచి శ్రీనగర్ కు ఫైట్ బుక్ చేసుకున్నాడు. ఫైట్ ను మధ్యాహ్నం 12 గంటలకు జమ్ము ఎయిట్ పోర్టులో చేరుకోవాలి. కానీ అతడు ఎక్కిన రైలు ఉదయం 8 గంటలకు రావాల్సింది మధ్యాహ్నం 12 గంటలకు గానీ చేరుకోలేదు. దీంతో సంజయ్ ఫ్లైట్ మిస్ అయ్యాడు. తీవ్రంగా నష్టపోయాడు. రైలు ఆలస్యం వల్ల తనకు కలిగిన నష్టంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే రైల్వే యాక్ట్ ప్రకారం పరిహారం చెల్లించలేమని రైల్వే శాఖ తరుఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ పేర్కొన్నాడు.


అయితే వినియోగదారుడి సమయానికి వెల కట్టలేరా? రైళ్ల ఆలస్యానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనని కోర్టు తేల్చిచెప్పింది. జవాబుదారీ తనం ఉండాలని సూచించింది. ఇలా రైళ్లు ఆలస్యంగా నడిపిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వచ్చే పోటీని తట్టుకోలేరంటూ హెచ్చరించింది. రైలును గమ్యస్థానం చేర్చలేకపోయినందుకు రైల్వేశాఖను సుప్రీంకోర్టు మందలించింది. రైలు ఆలస్యం కారణంగా నష్టపోయిన సంజీవ్ శుక్లాకు పరిహారంగా రూ.30000లను 9శఆతం వడ్డీతో చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *