వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం

వైఎస్ వివేకా హత్య కేసు ఈరోజు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు బుధవారం పులివెందులలోని వివేకా ఇంటివద్ద సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. హత్య జరిగిన రోజున నిందితులు ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించారు? ఎలా బయటకు వెళ్లారన్న దానిపై రీకన్ స్ట్రక్షన్ చేశారు.వైఎస్ వివేకా ఇంటికి నిందితులు బైక్ పై రావడం.. గేటు తీసి ఇంట్లోకి వెళ్లడం.. హత్య జరిగిన విధానం ఎవరెవరు ఎలా వచ్చారు? ఎప్పుడెప్పుడు వచ్చారు? ఎలా హత్య చేశారు? ఆ తర్వాత ఎలా వెళ్లారన్న దానిపై ఆ వ్యక్తుల ద్వారా సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తూ వీడియో తీసుకున్నారు.


హత్య చేసిన అనంతరం ఆయుధాలను పట్టణంలోని రోటరీ పురం వద్ద ఉన్న వంకలో వేసినట్టుగా అక్కడకు కూడా వెళ్లి రీకన్ స్ట్రక్షన్ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన ప్రధాన అనుచరుడు చాలాకాలం ఆయన్ను వెన్నంటే ఉన్న ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయనున్నట్టు సమాచారం. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మూడో నిందితుడిగా ఎర్ర గంగిరెడ్డిని అరెస్ట్ చాన్స్ ఉంది. బుధవారం మధ్యాహ్నం గంగిరెడ్డిని పులివెందుల నుంచి కడపకు తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటలకు వరకూ విచారించి ఆ తర్వాత కడప రిమ్స్ కు తీసుకెళ్లి కరోనా సహా ఇతర వైద్య పరీక్షలు చేయించారు. గురువారం పులివెందల కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


బుధవారం కూడా వివేకా ఇంట్లో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసిన సీబీఐ అధికారులు ఎర్రగంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి ఎలా ఇంట్లోకి ప్రవేశించారు.? ఏం జరిగింది? పారిపోయింది కల్పిత పాత్రలతో వీడియో తీశారు. ఇక సీన్ రీకన్ స్ట్రక్షన్ సమయంలో ఇంట్లో ఉన్న వివేకా కుమార్తె సునీతతో అధికారులు గంటపాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసులో నిందితుల పాత్రపై చర్చించినట్టు తెలుస్తోంది. వైఎస్ వివేకా హత్య జరిగిన 2019 మార్చి 14న రాత్రి ఆయనతోపాటు కారులో ఉన్నది ఎర్ర గంగిరెడ్డి మాత్రమే. ఆ తర్వాత అర్థరాత్రి దాటాకా.. నలుగురు వ్యక్తులు వైఎస్ వివేకా ఇంట్లోకి చొరబడి ఉంటారని సీబీఐ తేల్చింది. ఎర్ర గంగిరెడ్డి పాత్ర ఈ హత్యలో ఉందని తేల్చిన సీబీఐ అతడిని అరెస్ట్ కు రంగం సిద్ధం చేసింది. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *