ప్రభుత్వ౦ తీరుకు … కరోనాకు తేడా ఏమి లేదు: ఆర్జీవీ

సినిమా ఇండస్ట్రీ పరంగా చూస్తే.. ఏపీ ప్రభుత్వానికి కోవిడ్ మహమ్మారికి పెద్దగా తేడా లేదని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. రెండూ సినిమా ఇండస్ట్రీకి వచ్చే ఆదాయం తగ్గిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.  సినిమా ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వ వ్యవహార తీరును తప్పుపట్టారు. థియేటర్లు టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు మాట్లాడకపోవడంలో వింతేమీ లేదన్నారు.
అసలు వారు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. “ఇండస్ట్రీ పెద్దలంటే.. అంతా బాగా సెటిల్ అయినవారు. అలాంటి వారు ప్రభుత్వంతో గొడవపడాలని ఎందుకు అనుకుంటారు? అందుకే వారంతా కామ్గా ఉంటున్నా“రని అన్నారు. హీరోల రెమ్యూనరేషన్పై ఏపీ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలని స్టుపిడ్ ఆర్గ్యుమెంట్స్(బుద్ది లేని వాదన)గా ఆయన కొట్టిపారేశారు. ఎందుకంటే నిర్మాత ఎంత పెట్టి సినిమా నిర్మించాడనేది ఎవరూ చూడరు..ఫలానా హీరో బొమ్మ అని మాత్రమే ప్రేక్షకులు థియేటర్కి వస్తారని హీరో అనేవాడు బ్రాండ్ అని వర్మ పేర్కొన్నారు.
“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరను తగ్గించడం నా దృష్టిలో పూర్తిగా తప్పు“ అని అన్నారు. “ఉత్పత్తిదారుల కి ధర నిర్ణయించుకునే హక్కు ఉంది. కొనాలా వద్దా అనే ది వినియోగదారుడు ఇష్టం. టికెట్ ధర ఎంత ఉన్నా నచ్చిన వాళ్ళు చూస్తారు. నచ్చని వాళ్ళు మా నేస్తారు.“ అని వ్యాఖ్యానించాడు.

“సాధారణ కారు దరకు బెంజ్ కార్ ఇవ్వాలని అంటే ఎలా..! టికెట్ ధరలు తగ్గించడం ద్వారా ప్రభుత్వం కావాలనే ఇండస్ట్రీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందా లేదా అనేది నాకు తెలియదు. సినిమా టికెట్ ధరలు తగ్గించడం వల్ల హీరోలకు నష్టం ఏమీ లేదు. ఇలాంటి చర్యల ద్వారా అగ్రహీరోల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అసాధ్యం. ప్రభుత్వం ఏం చేసినా హీరోల పారితోషికం తగ్గటం అనేది అసాధ్యం. టికెట్ ధరలు తగ్గించడం నిర్మాతలకు నష్టం. ముమ్మాటికి ఏపీ ప్రభుత్వం చేస్తుంది తప్పే..“ అని వర్మ అన్నారు.Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *