టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ప్రభుత్వం నోటీసులు

మరో టీడీపీ నేతకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు పంపింది. దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో ఈ నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ తెలిపారు. సహకార చట్టంలోని సెక్షన్ 6ఏ కింద ట్రస్ట్ ను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.


వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని జవహర్ లాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ధూళిపాళ్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రి నడుస్తోంది. పాల రైతుల కుటుంబ సభ్యులకు ఈ ఆసుపత్రిలో రాయితోతో వైద్యం అందిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునే విషయంలో పలు ఆరోపనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గతంలోనే సంగం డెయిరీకి సంబంధించి అవినీతి ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ధూళిపాళ్లను ఏప్రిల్ 23 న అరెస్టు చేశారు. డెయిరీ రోజువారీ కార్యకలాపాల బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగించారు.తనపై నమోదైన క్రిమినల్ కేసులను సవాల్ చేస్తూ దూళిపాళ్ల దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణ సాగింది.తాజాగా ధూళిపాళ్ల ట్రస్ట్ పై ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం సంచలనమైంది.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *