ఎపి లో పెట్రోల్ పన్ను భారం ఎంతో తెలుసా

చాలా తక్కువ రాష్ట్రాలకు ఉండే ఒక లక్షణం ఆంధ్రప్రదేశ్ కు ఉంది. ఏపీకి అనుకొని ఉండే సరిహద్దురాష్ట్రాలు చాలా ఎక్కువనే చెప్పాలి. మొత్తం 13 జిల్లాల్లో కొద్ది జిల్లాలు తప్పించి.. మిగిలిన చాలా జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో సరిహద్దు సంబంధాలు ఉండటం గమనార్హం. ఓవైపు తెలంగాణ.. మరోవైపు తమిళనాడు.. ఇంకోవైపు కర్ణాటక.. ఒడిశాలు మాత్రమే కాదు.. పాండిచ్చేరి.. యానాం ఇలా రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మిగిలిన చోట్ల కంటే పెట్రోల్.. డీజిల్ ధరలు ఏపీలో ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు ఏపీకి సరిహద్దు రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు విషయానికే వస్తే.. ఏపీకి.. ఆ రాష్ట్రానికి లీటరు పెట్రోల్ ధరలో ఉన్న తేడా ఏంతో తెలుసా? అక్షరాల రూ.7లకు పైనే.


ఇదే విషయాన్ని ఈ మధ్యన తమిళనాడులోని ఒక పెట్రోల్ బంకు వారు పెద్ద గా పెట్టేసి..  మా దగ్గర పెట్రోల్ కొనుక్కుంటే లీటరుకు రూ.7.71 చొప్పున భారం తగ్గుతుందని ఊరించటం గమనార్హం. ఎందుకిలా? అంటే.. పెట్రోల్ మీద కేంద్రంతో పాటు.. ఆయా రాష్ట్రాలు అదనపు పన్నులు వడ్డించటం తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలో భారీ ఎత్తున పన్ను బాదుడు ఉంటే.. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉండటంతో.. సరిహద్దు జిల్లాల వారు నిర్మోహమాటంగా పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటున్న పరిస్థితి. పెట్రోల్ ధరలో తేడా ఎక్కువగా ఉండటంతో ఇంధనం కొట్టించుకోవటానికి ఐదారు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి మరీ వెళుతున్న వారు కూడా లేకపోలేదు.


మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటానికి కారణం.. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమేనని చెబుతున్నారు. ఇప్పటికే పెట్రోల్ మీద 31 శాతం.. డీజిల్ మీద 22.5 శాతం వ్యాట్ బాదేస్తున్నారు. ఇవి సరిపోవన్నట్లుగా లీటరుపై రూ.నాలుగు చొప్పున అదనపు వ్యాట్ అని.. రోడ్ డెవలప్ మెంట్ సెస్ అంటూ లీటరుపై మరో రూపాయినిన అదనపు సెస్ కింద వసూలు చేస్తున్నారు. ఇవే.. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్.. డీజిల్ కంటే ఎక్కువ ధర ఉండేలా చేస్తోంది. ఏపీకి చుట్టు ఉన్న ఇతర రాష్ట్రాల్లో వేసే పన్నులకు.. ఏపీలో విధిస్తున్న పన్నుకు తేడా ఎంతన్నది ఈ జాబితాను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.


ఈ కారణంగానే సరిహద్దు జిల్లాల్లోని చాలామంది పెట్రోల్.. డీజిల్ కోసం పక్క రాష్ట్రానికి వెళ్లి కొట్టించుకొని వస్తున్నారు. అంతేకాదు.. ఏపీ గుండా ప్రయాణించే వాహనాలుసైతం.. అత్యవసరమైతే తప్పించి.. పెట్రోల్.. డీజిల్ కొట్టించుకోవటానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. దీంతో అవసరమైన వారు తప్పించి పెట్రోల్.. డీజిల్ కొనుగోలు చేయని పరిస్థితి ఏపీలో ఉందని చెప్పక తప్పదు. ఏపీలో లీటరు పెట్రోల్ మీద రూ.28.49.. డీజిల్ మీద రూ.21.78 పన్ను బాదుడు ఉంటే.. పక్కనున్న రాష్ట్రాల విషయానికి వెళితే.. ఈ ఏడా ఎంత తక్కువగా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది.

(లీటరుపై వడ్డించే పన్ను వడ్డన రూపాయిల్లో)

రాష్ట్రం                 పెట్రోల్              డీజిల్        

ఏపీ                          28.49                   21.78
తెలంగాణ              26.64                   20.35
తమిళనాడు          24.31                    17.79
కర్ణాటక                  26.38                    18.00
ఒడిశా                    24.04                   20.93
Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *