జగన్ సొంత జిల్లా ‘టిప్పు సుల్తాన్’ విగ్రహ వివాదం

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో మరో వివాదం రాజుకుంది. ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు వ్యవహారం నానాటికీ వివాదాస్పదమవుతోంది. పట్టణంలో కొందరు మైనార్టీ వర్గాలతో కలిసి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహంపై బీజేపీ మండిపడుతోంది. ఇప్పటికే కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమాల్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ పార్టీ నేతలు.. ఇప్పుడు జగన్ సొంత జిల్లాల్లో.. అది వైసీపీ ఎమ్మెల్యే సాయంతో ఏర్పాటవుతున్న విగ్రహం పైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టిప్పు సుల్తాన్ సెగలు మొదలయ్యాయి.


సీఎం జగన్ సొంత జిల్లా కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థానికంగా ఉండే మైనార్టీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో వైసీపీ నేతలు ఏర్పాటు చేస్తున్న విగ్రహాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. దీనిపై ఆందోళన బాటపట్టింది. విగ్రహం ఏర్పాటు చేసే ముందు అతడి జీవిత చరిత్రను పూర్తిగా తెలుసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.విగ్రహా ఏర్పాటు మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రొద్దుటూరుకు వచ్చి ఈ ఆందోళనల్లో పాల్గొననున్నారు.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *