థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉన్నామ్… వ్యాక్సిన్లు ఒక్కటే మహమ్మారిని ఆపలేవు…

కరోనా మహమ్మారి గత ఏడాదిన్నరగా ప్రపంచానికి నిద్రలేకుండా చేస్తుంది. కరోనా జన్యూ మార్పులకు గురై కొత్త కొత్త రూపంలోకి మారుతూ దాడిచేస్తోంది. మహమ్మారి ముప్పుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరికలు చేసింది. థర్డ్ వేవ్ ముప్పు ముంగిట ఉన్నామని డబ్ల్యూహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథ్నామ్ ఘ్యాబ్రియోసిస్ గురువారం హెచ్చరికలు చేశారు. దురదృష్టవశాత్తూ.. థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉన్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
డెల్టా వేరియంట్ ముప్పు ఇంకా తొలగిపోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. డెల్టా వేరియంట్ వ్యాప్తిని సామాజిక చైతన్యం సమర్ధవంతమైన ప్రజారోగ్య చర్యల ద్వారా అడ్డుకోవాలని సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయన్నారు.

ఐరోపా ఉత్తర అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత కరోనా వైరస్ కేసులు మరణాలు తగ్గుముఖం పట్టాయి.. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారవుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. డెల్టా వేరియంట్ ఇప్పుడు 111కి పైగా దేశాలకు వ్యాపించింది. కాకపోతే ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కోవిడ్ వేరియంట్ గా ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు.
డబ్ల్యూహెచ్ఓ పరిధిలోని ఆరు రీజియన్లలో వరుసగా నాలుగు వారాల నుంచి కోవిడ్ కేసులు పెరుగుతునే ఉన్నాయి. అలాగే గత కొన్ని రోజులుగా తగ్గిన మరణాలు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్లు అత్యధికంగా కలిగి ఉన్న దేశాలు ఆంక్షలను ఎత్తివేసి కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారు. రెండోది వ్యాక్సిన్లు అందని దేశాలు వైరస్ దయ పై భారం వేశాయని అన్నారు. చాలా దేశాలు ఇప్పటి వరకూ ఎటువంటి టీకాలను పొందలేదని అన్నారు.

ఏడాది సెప్టెంబరు నాటికి ప్రతి దేశం తన జనాభాలో కనీసం 10 శాతం మందికి డిసెంబరుకు 40 శాతం మందికి 2022 మధ్య నాటికి 70 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపారు. అయితే వ్యాక్సిన్లు ఒక్కటే మహమ్మారిని ఆపలేవని అనుకూలమైన స్థిరమైన విధానంతో దేశాలు ముందుకు వెళ్లాలని సూచించారు. భౌతికదూరం మాస్క్ ధరించడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు.
ఇక భారతదేశం లో జనాభాలో 5 శాతం మాత్రమే రెండు మోతాదులను తీసుకున్నారు. దీనితో ప్రజల్లో నిర్లక్ష్యం కూడా అనేక రెట్లు పెరిగింది. అలాగే ఎదో కరోనా మొత్తం పూర్తిగా తగ్గిపోయినట్టు అప్పుడే యాత్రలకి సిద్ధమౌతున్నారు. ఇలాగే ఉంటే మూడో వేవ్ ముప్పు మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

యుకెలో 51 శాతం  కంటే ఎక్కువ జనాభా రెండు డోసులు ఇచ్చింది. అదేవిధంగా జనాభాలో 68% మందికి కనీసం ఒక మోతాదు టీకా తీసుకున్నారు. దీని తర్వాతే జూలై 19 నుంచి లాక్ డౌన్ ను సడలించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. కానీ కొత్త కేసులు  పెరిగిపోతున్నాయి. యూకే లో తాజాగా 42 వేలకి పైగా కరోనా మహమ్మారి కేసులు వెలుగులోకి వచ్చాయి.  దీంతో లాక్ డౌన్ సడలించినట్లయితే పరిస్థితి మెరుగుపడకుండా మరింత దిగజారిపోతుందని అకాడమీ ఆఫ్ మెడికల్ రాయల్ కాలేజ్ హెచ్చరించింది.ఇజ్రాయిల్ తన జనాభాకు వేగంగా టీకాలు వేసింది.

అక్కడ జనాభాలో 60% మందికి రెండు మోతాదులు ఇచ్చారు. జనాభాలో 66% మందికి కనీసం ఒక మోతాదు వ్యాక్సిన్ అందింది. ఈ సంఖ్య 50% కి చేరుకున్నప్పుడు మాస్క్ లు ధరించే అవసరం లేదంటూ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు కేసులు మళ్లీ పెరగడం ప్రారంభం అయ్యాయి. సంక్రమణ రేటు ఆధారంగా ఇజ్రాయిల్ అంతటా 5 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు.

స్పెయిన్ లో జనాభాలో 45 శాతం మందికి రెండు మోతాదులు అందించారు. అదే విధంగా జనాభాలో 59 శాతం మంది కనీసం ఒక మోతాదు తీసుకున్నారు. దీని తరువాత కూడా పాజిటివిటీ రేటు గత వారం రెట్టింపు అయింది. టీకాలు వేయని 20 నుంచి 29 ఏళ్ల యువకుల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష మంది యువతలో 911 మంది యువకులకు పాజిటివ్ వస్తోంది. యుఎస్ జనాభాలో 49 శాతం మందికి పూర్తిగా టీకాలు వేయగా 77 శాతం జనాభాకు కనీసం ఒక మోతాదు టీకా అందింది. దీని తరువాత కూడా సగం రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడం ప్రారంభించాయి. గత వారంలో ప్రతి రోజు సగటున 19 వేల కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి. కరోనా డెల్టా వేరియంట్ 80 శాతం కొత్త కేసులలో కారణం.

ఇక మన దేశంలో జూలై 11 వరకు 37.73 కోట్ల మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందింది. జనాభా పరంగా ఇది 22 శాతం. అదే సమయంలో జనాభాలో 5 శాతం మందికి మాత్రమే రెండు డోసుల టీకా అందింది. ప్రతిరోజూ సుమారు 35 లక్షల మోతాదులను ఇస్తున్నారు. అదే రేటుతో దేశంలో టీకాలు కొనసాగించినా భారతదేశ జనాభాలో సగం మందికి టీకాలు వేయడానికి చాలా నెలలు పడుతుంది.
దేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. టీకా తర్వాత కూడా కరోనా కొత్త కేసులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే  డబ్ల్యూహెచ్ ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ప్రకారం .. డెల్టా ఆఫ్ కరోనాతో సహా ఇతర రకాలు సమస్యను పెంచాయి. డెల్టా వేరియంట్ 100 దేశాలకు వ్యాపించింది. యుఎస్‌లో కొత్త కేసుల్లో 80% డెల్టాకు చెందినవి. అలాగే లాంబ్డా వేరియంట్ కూడా 31 దేశాలకు చేరుకుంది.

వ్యాక్సిన్ 50 శాతం మార్కును దాటిన దేశాలలో ప్రభుత్వాలు లాక్ డౌన్ లో సడలింపులు తీసుకువచ్చాయి. తత్ఫలితంగా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఇస్తున్నారు. ఇజ్రాయి ల్లో ఎన్నికల తరువాత కేసులు పెరగడం ప్రారంభించాయి. ఐరోపాలోని అనేక దేశాలలో నైట్‌క్లబ్‌లు ప్రారంభించారు. వ్యాక్సినేషన్ లో వేగం లేకపోవడం కూడా చాలా దేశాలలో కొత్త కేసులను కూడా తెరపైకి తెస్తోంది. రష్యా మెక్సికో ఆస్ట్రేలియా ఇండోనేషియా దక్షిణ కొరియా వంటి దేశాల్లో కేసులు నిరంతరం పెరుగుతున్నాయి.

ఇండోనేషియాలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఆక్సిజన్ కోసం ఇతర దేశాల సహాయం కోరవలసి ఉంది. టీకా రెండు మోతాదుల తర్వాత 6 నుండి 12 నెలల తర్వాత మూడవ బూస్టర్ మోతాదు అవసరమని ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బోర్లా చెప్పారు. కొన్ని వారాల్లో యుఎస్ యూరోపియన్ యూనియన్‌కు మూడవ బూస్టర్ మోతాదుకు ఫైజర్ దరఖాస్తు చేసుకోవచ్చని భావిస్తున్నారు. కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ ప్రభావం తక్కువగా ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. టీకా తక్కువ ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రతిరోధకాల సంఖ్యను పెంచడానికి బూస్టర్ మోతాదు ఒక ఎంపిక.
Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *