సీబీఐ అధికారులతో వైఎస్ వివేకా కుమార్తె సునీత భేటీ





ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐతో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి నిన్న భేటీ అయ్యారు. నిన్న కడప చేరుకున్న వారు వారు సీబీఐ అధికారులతో దాదాపు గంటపాటు సమావేశమై కేసు పురోగతిపై చర్చించారు. కాగా, ఎంపీ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు, యురేనియం కర్మాగారంలో పనిచేస్తున్న ఉదయ్‌శంకర్‌రెడ్డి నిన్న సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయ్‌ను సీబీఐ గతంలోనూ పలుమార్లు విచారించింది.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *